తేమ శాతం ఎంత ఉన్నా ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2022-11-25T00:43:12+05:30 IST

ప్రతికూల వాతావరణం కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా తేమశాతం 17 పైన ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని బాపులపాడు మండల వ్యవసాయ మండలి చైర్మన్‌ దయాల విజయ నాయుడు రైతులకు సూచించారు.

తేమ శాతం ఎంత ఉన్నా ధాన్యం కొనుగోలు

హనుమాన్‌జంక్షన్‌, నవంబరు 24: ప్రతికూల వాతావరణం కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా తేమశాతం 17 పైన ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని బాపులపాడు మండల వ్యవసాయ మండలి చైర్మన్‌ దయాల విజయ నాయుడు రైతులకు సూచించారు. గురువారం మండల వ్యవసాయ కేంద్రంలో ఆయన మాట్లాడారు. 17శాతం పైన ప్రతి ఒక్క శాతానికి క్వింటాలుకు కేజీ చొప్పున కోత విధించి తీసుకుంటారని మండల వ్యవసాయాధికారి భవాని తెలిపారు. ఎంపీ పీ వై.నగేష్‌, జడ్పీటీసీ సభ్యురాలు కొమరవల్లి గంగాభవాని, నక్కాగాంధీ, చిర్రా అంజిబాబు, కొండపావులూరి కృష్ణప్రసాద్‌, గరికపాటి వెంకటేశ్వరరావు, మండల ఉద్యానవన శాఖాధికారి హరిశ్చంద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:43:12+05:30 IST

Read more