రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనాలి

ABN , First Publish Date - 2022-12-13T01:56:46+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ రైతులను తీవ్రంగా నష్ట పెట్టిందని, పంట దెబ్బతిన్న ప్రతీ రైతుకు ఎకరాకు లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్‌ చేశారు.

 రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనాలి
కూచిపూడిలో వరి పనలను పరిశీలిస్తున్న రుద్రరాజు

సీఎం తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకొచ్చి రైతుల కష్టాలు తెలుసుకోవాలి: పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు

కూచిపూడి, డిసెంబరు 12: మాండస్‌ తుఫాన్‌ రైతులను తీవ్రంగా నష్ట పెట్టిందని, పంట దెబ్బతిన్న ప్రతీ రైతుకు ఎకరాకు లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయట కొస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని ఆయన చురకలంటించారు. కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం కూచిపూడిలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించింది. రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేక పొలాలు ముంపునకు గురయ్యాయని, వ్యవసాయంపై ఆధారపడి జీవి స్తున్న 80 శాతం మంది నష్టపోయారని ఆయన అన్నారు. నేతలు సుం కర పద్మశ్రీ, తాంతియా కుమారి, పోతురాజు ఏసుదాసు, ధనేకుల మురళి, హైదర్‌ అబ్బాస్‌, పిట్టు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:56:46+05:30 IST

Read more