14 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-06-12T07:00:00+05:30 IST

స్థానిక పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్ధిత వేంకటేశ్వరస్వామి దేవస్థాన ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ అధ్యక్షకార్యదర్శులు లింగిపిల్లి అప్పారావు, మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు(పీసీ) పేర్కొన్నారు.

14 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అప్పారావు, హనుమంతరావు

చిట్టినగర్‌, జూన్‌ 11 : స్థానిక పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్ధిత వేంకటేశ్వరస్వామి దేవస్థాన ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ అధ్యక్షకార్యదర్శులు లింగిపిల్లి అప్పారావు, మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు(పీసీ) పేర్కొన్నారు. శనివారం చిట్టినగర్‌ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం ఆస్థాన మండపంలో జరిగిన విలేఖర్ల సమావేశలో వారు మాట్లాడుతూ శ్రీ శుభ్‌కృత్‌ నామ సంవత్సర జ్యేష్ఠ పూర్ణిమ నుంచి చవితి జూన్‌ 14 నుంచి 18 వరకు, మురికిపూడి మనిదీ్‌పకుమార్‌ (ప్రొఫెసర్‌ వైదిక్‌ వర్శిటీ తిరుమల) ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు వినుకొండ రత్నామాచార్యులు, సహాయ అర్చకులు పులిపాక సాయి ప్రత్యేక్ష పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. 14న ఉదయం కృష్ణానదీ జలాలతో ఉత్సవమూర్తులకు సహస్రకలశాభిషేకం, స్వామివారిని పెండ్లికుమారుని చేయటం, సాయంత్రం విష్యక్సేన పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ, వాసుపూజ, వాస్తుహోమం, దీక్షాచరణ, కంకణధారణ, గరుడ ఆరాధన పూజలు జరుగుతాయన్నారు. 15న ఉదయం శేషవాహనసేవ (తిరుమాడ వీధుల్లో) అగ్ని మఽధన, అగ్ని ప్రతిష్ఠ, భేరిపూజ, నవకుంభస్థాపన, ధ్వజారోహణ, సాయంత్రం నిత్యహోమం, బలిహరణాదులు, అష్టాక్షరీ హోమం, నవగ్రహ ఆరాదనం, నవగ్రహహోమం, రాఽజాధిరాజ పెరుమాళ్‌ ఊరేగింపు (తిరుమాడ వీధుల్లో) జరుగుతుందన్నారు. 16న ఉదయం నిత్యహోమం, బలిహరణాదులు, పారమాత్మిక హోమం, ఽసూర్యప్రభవాహనోత్సవం (తిరుమాఢ వీధుల్లో) అనంతరం సామూహిక కుంకుమార్చన, సాయంత్రం నిత్యహోమం, బలిహరణాధులు, మహాశాంతి హోమం, శ్రీవారి కల్యాణం మహోత్సవం జరుగుతాయన్నారు. 17న ఉదయం నిత్యహోమం, బలిహరణాదులు, మహాశాంతి హోమం, పుష్పయాగం, సాయంత్రం గరుడవాహనంపై స్వామి నగరోత్సవం, మహాశాంతి హోమం జరుగుతుందన్నారు. 18న ఉదయం శ్రవణా నక్షత్రం సందర్భంగా ధృవమూర్తికి అభిషేకం, ఉత్పమూర్తులకు పంచామృతాభిషేకం, నిత్యహోమం, బలిహారణ, వసంతోత్సవం, అవబృతోత్సవం, చక్రస్నానం, పూర్ణాహుతి, సాయంత్రం ద్వాదశి ప్రదక్షిములు, స్వామి పవళింపుసేవ జరుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కమిటీ సభ్యులు పణుకు రమ, మజ్జి శ్రీనివాసరావు, పోతిన వెంకట ధర్మారావు, యీది ఎల్లా రాజారావు, ఈది ఎల్లారావు, శీరం వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-12T07:00:00+05:30 IST