అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్న జగన్‌..క్షమాపణ చెప్పాలి: బొండా ఉమ

ABN , First Publish Date - 2022-03-23T18:14:50+05:30 IST

కల్తీ మద్యంతో వైసీపీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్న జగన్‌..క్షమాపణ చెప్పాలి: బొండా ఉమ

విజయవాడ: ఏపీలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, కల్తీ మద్యంతో వైసీపీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సారా మరణాలను సహజ మరణాలనడం సిగ్గుచేటని, అసెంబ్లీ విలువలు మంటగలిపేలా ముఖ్యమంత్రి ప్రకటన ఇచ్చారని, సభలో అబద్ధాలు చెబుతున్న సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యాన్ని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించాలని బోండా ఉమ కోరారు.

Read more