భక్తసంద్రం

ABN , First Publish Date - 2022-10-03T06:18:52+05:30 IST

భక్తసంద్రం

భక్తసంద్రం
సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి నక్షత్ర హారతి

దసరా ఉత్సవాల్లో ఏడో రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించు కునేందుకు తండోప తండాలుగా తరలివచ్చిన భక్త జన సంద్రంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు కిటకిట లాడాయి. ఉత్తరాంధ్ర నుంచి 450 కిలోమీటర్ల దూరం  కాలినడకన వచ్చి భవానీ దీక్షాదారులు అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా యంత్రాంగం, పోలీసుల సమన్వయంతోనే దర్శనాలు సాఫీగా సాగాయని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కితాబిచ్చారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం  రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

మూలా నక్షత్రం.. సరస్వతి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు..కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి పరిసరాలు.. 30 వేల మంది భవానీల రాకసాఫీగా దర్శనాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ / వన్‌టౌన్‌) : మూలా నక్షత్రం రోజున ఇబ్బంది పడకుండా సామాన్య భక్తులు సాఫీగా దర్శనాలు చేసుకు న్నారు. అన్ని రకాల ప్రొటోకాల్‌ దర్శనాలు,  అంతరాలయ దర్శనాలు నిలుపుదల చేయడం, కొండ మీదకు చాలా వరకు వాహనాలను నియంత్రించటం, అనుమతించిన వాహనాల్లో వచ్చిన వారిని కూడా ఓం టర్నింగ్‌ దగ్గర నుంచి క్యూల్లోకి పంపించటంతో సామాన్య భక్తుల దర్శ నాలు సాఫీగా నడిచాయి. శనివారం అర్ధరాత్రి నుంచి కలెక్టర్‌ దిల్లీరావు, సీపీ రాణాలు దర్శ నాలను పర్యవేక్షించారు. వీఐపీ, ప్రోటోకాల్‌ దర్శ నాలను 1.30 గంటల నుంచి తెల్లవారు ఝా మున నాలుగు గంటల వరకు మాత్రమే చే యించారు. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు ఝాము వరకు కలెక్టర్‌ దిల్లీరావు ఆదేశాల మేర కు డీఆర్వో మోహనరావు ప్రత్యేక బాధ్యతలు నిర్వహించారు. ఓం టర్నింగ్‌ నుంచి ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. తెల్లవారు ఝా మునే కలెక్టర్‌ దిల్లీరావు కొండమీదకు వచ్చి నియ ంత్రించారు. ఉదయం నుంచి జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌, విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ టోల్‌గేట్‌ దగ్గర విధులు నిర్వహించారు. జేసీ నుపూర్‌ ఎలాంటి వాహనాలను పైకి అనుమతించలేదు. ముని సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అక్కడే ఉండి వాకీటాకీలో శానిటేషన్‌, పారిశుధ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసు కమిషనర్‌ కాంతి రాణా పోలీసులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ పర్య వేక్షించారు. క్యూలపైన ఒత్తిడి పడకుండా సీతమ్మవారి పాదాల దగ్గర, కార్పొరేషన్‌ దగ్గర రోప్‌లతో చాంబర్‌ను సృష్టించి భక్తులను నిలుపు దల చేయించారు. దీంతో తొక్కిసలాటలు జర గలేదు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్య నారాయణ కూడా కొండపైన పరిస్థితులను చక్క దిద్దారు. కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌, దేవాదాయ శాఖ మంత్రుల మధ్య సమన్వయం చక్కగా ఉండడంతో క్యూలు ఆగకూడదన్న కలెక్టర్‌, సీపీ ఆకాంక్షలు ఫలించాయి. దీంతో లైన్లు సాఫీగా నడిచిపోయాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైతే లైన్లలో భక్తులు వడివడిగా నడవటమే కనిపించింది. అమ్మవారికి నివేదన సమయంలో దర్శనం ఆగిపోయే సమయంలో క్యూల్లో భక్తులు నిలిచిపోయారు. ఈ ప్రభావం ఆ తర్వాత కని పించింది. ముఖ్యమంత్రి వచ్చే సందర్భంలో 60 నిమిషాల సేపు భక్తులను నిలువరించారు. ఈ రెండు కారణాల వల్లనే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వడిగా క్యూలు సాగలేదు. అయినప్పటికీ.. భక్తులు నిలిచిపోయే పరిస్తితి రాలేదు. మూలా నక్షత్రం అనే పెద్ద టాస్క్‌ను జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగాలు ఆదివారం అమ్మ దర్శనం ప్రారంభమైనప్పటి నుంచి అనుక్షణం అప్రమత్తంగా ఉండి, పర్యవేక్షించడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేసుకున్నారు. జై భవానీ!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భవానీలు పోటెత్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల నుంచి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఆదివారం విజయవాడకు చేరుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి 450 కిలోమీటర్ల పైబడి నడిచి వచ్చారు. పది రోజుల కిందట వీరంతా కాలినడకన విజయవాడకు బయలుదేరారు. రోజుకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఎన్‌హెచ్‌ - 16 వెంబడి నడుస్తూ వచ్చారు. ఉత్త రాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన భవానీలు చాలా వరకు ఆదివారం నడి ఝాముకే చేరుకున్నారు. మిగిలిన వారు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. 

ఎరుపెక్కిన ఆలయ పరిసరాలు

జల్లు స్నానమాచరించాక క్యూల్లోకి వచ్చి, ఘాట్‌ మార్గంలోని క్యూల్లో నడుచుకుంటూ అమ్మ సన్నిధికి చేరుకుని దర్శించుకున్నారు. అనంతరం భవానీదీక్ష మండపంలో నేతి కొబ్బరికాయలను వదిలి వెళ్లారు. తెలుగు రాష్ర్టాల నుంచి భవానీ దీక్షలను చేపట్టిన వారు బస్సుల్లో పెద్ద సంఖ్యలో వచ్చారు. బస్‌స్టేషన్‌ నుంచి కాలిబాటన క్యూలలోకి చేరుకున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచీ ఈ సారి ఎక్కువ సంఖ్యలో భవానీలు వచ్చారు. తెలంగాణ నుంచి ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో పెద్ద సంఖ్యలో బస్‌స్టేషన్‌, హరిత బెర్మ్‌పార్క్‌ ప్రాంతాలకు వచ్చి అక్కడి నుంచి కాలిబాటన క్యూల్లోకి చేరుకున్నారు. కర్నాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లలో విజయ వాడ వచ్చినవారు స్టేషన్‌ నుంచి నడుచుకుంటూ కాళేశ్వరరావు మార్కెట్‌ మీదుగా క్యూల్లోకి ప్రవేశించారు. ఆలయ పరిసరాలు ఎరుపెక్కాయి. భవానీదీక్షా మండపంలో భవానీలు విశేష పూజలు నిర్వహించారు. 

దసరా నాటికి భారీగా రాక

దసరా పర్వదినంతో ఉత్సవాలు ముగుస్తాయి. మూలానక్షత్రం నుంచి అధిక సంఖ్యలో భవానీల రాక ప్రారంభమై దసరా నాటికి భారీగా  వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండున్నర లక్షల మంది దీక్షాధారణ చేసినట్టు తెలుస్తోంది. ఉత్సవాల్లో లక్షన్నర మంది భవానీలు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం వరకు 20 వేల మంది వచ్చారని అంచనా. మూలా నక్షత్రం రోజున 30 వేల మంది వచ్చారని తెలుస్తోంది. దసరా నాటికి మరో లక్ష మంది భవానీలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 


Read more