కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్య సేవలు

ABN , First Publish Date - 2022-11-30T01:15:13+05:30 IST

ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.తిరుమల కృష్ణబాబు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విస్సన్నపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు, నాడు-నేడు పనులను పరిశీలించారు.

కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్య సేవలు
వైద్యులకు సూచనలు చేస్తున్న ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు

విస్సన్నపేట, నవంబరు 29 : ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.తిరుమల కృష్ణబాబు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విస్సన్నపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు, నాడు-నేడు పనులను పరిశీలించారు. గడువులోగా పనుల్ని పూర్తిచేయాలని ఆదేశించారు. ఎనిమిది నెలలుగా ఆప్కోస్‌ నుంచి జీతాలు రావడం లేదని అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా.. వెంటనే జీతాలు చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న స్టాఫ్‌ నర్సు పోస్టులు, జనరల్‌ మెడిషన్‌ డాక్టర్‌ పోస్టును భర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఎ.కొండూరు పీహెచ్‌సీలోనే డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రూ.6 కోట్లతో 15 తండాలకు వాటర్‌ ట్యాంక్‌ల ద్వారా కృష్ణాజలాలను అందిస్తామన్నారు. ఫ్లోరిడ్‌ రహిత తాగునీరు అందించేందుకు రూ.38 కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ లక్ష్మికుమార్‌, సూపరింటెండెంట్‌ యూ.రమేష్‌, వైద్యులు హెలీనా, విజయబాబు, పావని, వెంకటేశ్వరరావు, అనితలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T01:15:14+05:30 IST