నమ్మి ఓట్లేస్తే.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు

ABN , First Publish Date - 2022-02-16T06:33:50+05:30 IST

నమ్మి ఓట్లేస్తే రాష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేశాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కట్టుబడిపాలెంలో మంగళవారం జరిగిన గౌరవసభలో పాల్గొన్నారు. తొలుత గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సభలో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే చీకటిరాజ్యం వస్తుందని నాడు చంద్రబాబు చెప్పిన మాటలు నేడు నిజమైయ్యాయన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని, లక్షల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఉత్తర కుమార ప్రగల్బాలు కట్టిపెట్టాలన్నారు.

నమ్మి ఓట్లేస్తే.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు
కట్టుబడిపాలెంలో మహిళతో మాట్లాడుతున్న దేవినేని ఉమా

 నాడు చంద్రబాబు చెప్పిన మాటలు నిజమయ్యాయి

అధికారంలోకి వస్తే మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌ చేస్తాం

కట్టుబడిపాలెం గౌరవ సభలో మాజీమంత్రి దేవినేని ఉమా  

జి.కొండూరు, ఫిబ్రవరి 15: నమ్మి ఓట్లేస్తే రాష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేశాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కట్టుబడిపాలెంలో మంగళవారం జరిగిన గౌరవసభలో పాల్గొన్నారు. తొలుత గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజల  నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సభలో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే చీకటిరాజ్యం వస్తుందని నాడు చంద్రబాబు చెప్పిన మాటలు నేడు నిజమైయ్యాయన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని, లక్షల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఉత్తర కుమార ప్రగల్బాలు కట్టిపెట్టాలన్నారు. షాబాద్‌ కొండలు కొల్లగొట్టారని, పోలవరం కాల్వ కట్ట మట్టి మాయం చేశారని ఆరోపించారు. కొండపల్లిలో పునికి చెట్లు కొట్టేసి ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు టీడీపీ నేతలను పంపి వైసీపీ నేతలు చంకలు గుద్దుకున్నారన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ టీడీపీ కౌన్సిలర్స్‌కు సమాచారం ఇవ్వకుండా రెండు కార్యక్రమాలు చేయడాన్ని తప్పు పట్టారు. పిచ్చి మాటలు కట్టిపెట్టి మైలవరం రెవెన్యూ డివిజన్‌ సంగతేంటో తేల్చాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మైలవరాన్ని  రెవెన్యూ డివిజన్‌ చేస్తామని చాలెంజ్‌ చేసి చెప్పారు. బహిరంగ చర్చకే కాదు ఏ చర్చకైనా టీడీపీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యేకు ఉమా సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు పజ్జూరు రవికుమార్‌ (వెంకయ్య), ప్రధాన కార్యదర్శి లంక రామకృష్ణ, ఉయ్యూరు వెంకట నరసింహారావు, లంక లితీష్‌, మన్నం వెంకట చౌదరి, కోయ పాపారావు, బసవబోయిన నాగేశ్వరరావు, సుకవాసి శ్రీహరి, ధనేకుల శ్రీకాంత్‌, కావిటి వెంకట్రావ్‌, బసవబోయిన రవి, కార్యదర్శి బుస్సు లక్ష్మణరావు, కిలారు వెంకట రత్నం, చుట్టుకుదురు శ్రీనివాసరావు, బయ్యా రామోజీ (రాము) పాల్గొన్నారు. 


నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం

చాట్రాయి: ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక చతికల పడ్డారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. చనుబండలో మంగళవారం గౌరవ సభలో ఆయన మాట్లాడుతూ పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పథకం ఎందుకు రద్దు చేశారని, వ్యవసాయానికి నీరు అవసరం లేదా అని ప్రశ్నించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నారు.ప్రజాసమస్యలపై ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మరిడి చిట్టిబాబు, మోరంపూడి శ్రీనివాసరావు, కందుల కృష్ణ, చిదిరాల మారేశ్వరరావు, బొట్టు రామచంద్రరావు, జక్కంపూడి ప్రదీప్‌, నోబుల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-16T06:33:50+05:30 IST