పరిశుభ్రత వారోత్సవాలపై అవగాహన ర్యాలీ

ABN , First Publish Date - 2022-04-24T05:59:59+05:30 IST

పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం సత్యనారాయణపురంలో స్థానిక కార్పోరేటర్‌ శర్వాణీ మూర్తితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.

పరిశుభ్రత వారోత్సవాలపై   అవగాహన ర్యాలీ

 పరిశుభ్రత వారోత్సవాలపై 

అవగాహన ర్యాలీ

సత్యనారాయణపురం, ఏప్రిల్‌ 23:  పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం సత్యనారాయణపురంలో స్థానిక కార్పోరేటర్‌ శర్వాణీ మూర్తితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. వీఎంసీ సిబ్బందితో కలిసి గోడలకు రంగులు వేశారు. అనంతరం వారోత్సవాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. నగరపాలక సంస్థ ఈఈ శ్రీనివాస్‌ , జోనల్‌ కమిషనర్‌ రాజు, డీఈ గురునాథం, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అమృత్‌ పథకంలో భాగంగా సత్యనారాయణపురం గిరీ వీధిలో చేపట్టిన యూజీడీ సంపు నిర్మాణపు పనుల విష్ణు పర్యవేక్షించారు. 

భారతీనగర్‌: నాలుగో డివిజన్‌  కార్పొరేటర్‌ జాస్తి సాంబశివరావు ఆధ్వర్యంలో శ్రీ నగర్‌ కాలనీలో శనివారం  పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. శ్రీనగర్‌ కాలనీలోని ప్రధాన, అంతర్గత రోడ్లన్నీ శానిటరీ సిబ్బంది శుభ్రం చేశారు.  డివిజన్‌ శానిటరీ అధికారులు ఎస్‌కె రాయుల్‌, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.  

Read more