ఎలక్ర్టానిక్స్‌- ఐవోటీలో మంచి ఉపాధి అవకాశాలు

ABN , First Publish Date - 2022-02-23T06:28:54+05:30 IST

ఎలక్ర్టానిక్స్‌- ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ)లో మంచి ఉపాధి అవకాశాలున్నాయని హైదరాబాద్‌కు చెందిన ఐవోటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం. వెంకటేశ్వరరావు అన్నారు.

ఎలక్ర్టానిక్స్‌- ఐవోటీలో మంచి ఉపాధి అవకాశాలు
డాక్టర్‌ వెంకటేశ్వరరావు

ఎలక్ర్టానిక్స్‌- ఐవోటీలో మంచి ఉపాధి అవకాశాలు

 ఐవోటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు 

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 22:ఎలక్ర్టానిక్స్‌- ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ)లో మంచి ఉపాధి అవకాశాలున్నాయని హైదరాబాద్‌కు చెందిన ఐవోటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. కేబీఎన్‌ కాలేజీ ఫిజిక్స్‌, ఎలక్ర్టానిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఎలకా్ట్రనిక్స్‌- ఐవోటీ రంగాల్లో విస్తరిస్తున్న నూతన సాంకేతిక అవిష్కరణలు -అవకాశాలు అంశంపై మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో  ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎలకా్ట్రనిక్స్‌-ఐవోటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, నూతన ఆవిష్కరణలు ఎన్నో వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు తమ ఆలోచనలకు మరింత పదును పెడితే చక్కని ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చునన్నారు. సదస్సుకు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. విభాగాధిపతి సీహెచ్‌ నాగభూషణం, వైఎస్‌ ప్రిన్సిపాళ్ళు పీఎల్‌ రమేష్‌, ఎం వెంకటేశ్వరరావు, అఽధ్యాపకుడు ఉదయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more