-
-
Home » Andhra Pradesh » Krishna » awerness programe about drugs-NGTS-AndhraPradesh
-
మాదకద్రవ్యాలపై అవగాహన
ABN , First Publish Date - 2022-08-17T06:13:00+05:30 IST
మనిషి మీద మత్తు పదార్థాలు తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని ఒక్కోసారి ప్రాణాలు పోయేంత ప్రమాదం వస్తుందని నవజీవన్ బాలభవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్ బాబు చెప్పారు.

మాదకద్రవ్యాలపై అవగాహన
మొగల్రాజపురం, ఆగస్టు 16: మనిషి మీద మత్తు పదార్థాలు తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని ఒక్కోసారి ప్రాణాలు పోయేంత ప్రమాదం వస్తుందని నవజీవన్ బాలభవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్ బాబు చెప్పారు. మొగల్రాజపురం బీఎస్‌ఆర్‌కే మున్సిపల్ పాఠశాలలో మంగళవారం మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను స్ర్కీన్ ప్రొజెక్షన్ ద్వారా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా చట్ట విరుద్ధంగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులు, మీ ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకిని అని ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్దాల వినియోగం నుంచి మనిషిని బయటకు తీసుకురావడానికి డి ఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయని పెజ్జోనిపేటలో నీ తోడు మానసిక వికాస కేంద్రాన్ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎస్‌వీఎన్ గణేష్ ,నవజీవన్ బాలభవన్ జోనల్ కో- ఆర్డినేటర్స్ ఆంజనేయులు, మమత, కె. శ్రీవల్లి, 89, 90 వార్డు సచివాలయ మహిళా పోలీసు ఎం.లక్ష్మి, టి. భాగ్యలత, విద్యార్థులు పాల్గొన్నారు.