-
-
Home » Andhra Pradesh » Krishna » awerness programe about collestrol-NGTS-AndhraPradesh
-
ఆహార నియమాలపై అవగాహన అవసరం
ABN , First Publish Date - 2022-09-08T06:16:28+05:30 IST
ఆహారం విషయంలో జీవనశైలిలో మార్పులు వల్లే అనేక వ్యాధులు వస్తున్నాయని వైద్య నిపుణురాలు సుష్మ గుమ్మా అన్నారు.

ఆహార నియమాలపై అవగాహన అవసరం
వన్‌టౌన్, సెప్టెంబరు 7: ఆహారం విషయంలో జీవనశైలిలో మార్పులు వల్లే అనేక వ్యాధులు వస్తున్నాయని వైద్య నిపుణురాలు సుష్మ గుమ్మా అన్నారు. పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ మెకానికల్ ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో కొవ్వును తొలగించుకోండి అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఆహార నియమాలపై ప్రతి ఒక్క రు అవగాహన కల్పించు కోవాలన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సెప్టెం బరు మొదటి వారాన్ని జాతీయ పోషకాహార వారోత్సవంగా పరిగ ణిస్తారన్నారు. వైస్ ప్రిన్సి పాల్ డాక్టర్ పతంజలి శాస్త్రి, అధ్యాపకులు డాక్టర్ అబిద్ ఆలీ, వై రాజేంద్ర బాబు, ఎస్వీ మాళవిక, బి.జ్యోత్స్న పాల్గొన్నారు.