అన్న క్యాంటీన్‌లను ఆపే ప్రయత్నం మానుకోవాలి

ABN , First Publish Date - 2022-07-18T06:21:12+05:30 IST

వైసీపీ అన్న క్యాంటీన్‌లను తీసివేసి పేదవాళ్ల పొట్టకొట్టిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

అన్న క్యాంటీన్‌లను ఆపే ప్రయత్నం మానుకోవాలి
వడ్డిస్తున్న దేవినేని ఉమా

మాజీ మంత్రి దేవినేని ఉమా

మైలవరం, జూలై 17: వైసీపీ అన్న క్యాంటీన్‌లను తీసివేసి పేదవాళ్ల పొట్టకొట్టిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్‌ ప్రభుత్వం పేదల కడుపు కొడుతుంటే అన్న క్యాంటీన్‌లు వారి కడుపు నింపుతున్నాయన్నారు. వైసీసీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వీటిని ఎత్తివేసిందని ఆరోపించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాధాకృష్ణ, వరికూటి శ్రీనివాసరావు, శ్రీహరి, బెనర్జీ, రోశయ్య, అంజీ పాల్గొన్నారు.


Read more