అవనిగడ్డ వసతిగృహంలో ఎమ్మెల్యే సింహాద్రి తనిఖీలు

ABN , First Publish Date - 2022-08-01T06:33:52+05:30 IST

అవనిగడ్డ వసతిగృహంలో ఎమ్మెల్యే సింహాద్రి తనిఖీలు

అవనిగడ్డ వసతిగృహంలో ఎమ్మెల్యే సింహాద్రి తనిఖీలు
బీసీ వసతిగృహంలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

 విధినిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

అవనిగడ్డ టౌన్‌, జూలై 31 : వసతిగృహ సంక్షేమ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు హెచ్చరించారు. ఆదివారం అవనిగడ్డలోని వసతిగృహాన్ని ఎమ్మెల్యే ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వసతిగృహ సంక్షేమాధికారి తమ్ము శ్రీనివాసరావు  అక్కడ లేకపోవటం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి విద్యార్థులకు వడ్డించే పలావు నాణ్యత సరిగా లేదని, ఇకపై ఇలాంటి అలసత్వాన్ని ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. బీసీ బాలుర వసతిగృహం తనిఖీ సమయంలో అక్కడి వసతిగృహాధికారి ఆవుల భాస్కరరావు కూడా లేకపోవటం, శనివారం  జరిపిన పర్యటనలోనూ ఆయన వసతిగృహంలో అందుబాటులో లేకపోవటంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహంలో శ్లాబుపై నుంచి వర్షపు నీరు కారుతున్న విషయాన్ని అక్కడి విద్యార్థులు, సంక్షేమాధికారి గణేష్‌ ఎమ్మెల్యేకు విన్నవించగా, ఉన్నతాధికారులకు ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిందిగా చెబుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతి దేవి, జడ్పీటీసీ సభ్యుడు చింతలపూడి లక్ష్మినారాయణ, సర్పంచ్‌ గొరుముచ్చు ఉమా, కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ నజీర్‌ బాషా, దిడ్ల కిరణ్‌, సింహాంద్రి వెంక టేశ్వరరావు, సీఐ శ్రీనివాస్‌, ఈవోపిఆర్‌డి శైలజా కుమారి పాల్గొన్నారు.

నాగాయలంక : నాగాయలంకలోని బీసీ, ఎస్సీ బాలికల వసతిగృహా లను ఆదివారం  జడ్పీటీసీ సభ్యుడు మోకా బుచ్చిబాబు ఆకస్మికంగా పరిశీ లించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనం మెనూను, నీటి సౌకర్యం, గదులలోని వసతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. వసతిగృహాల్లో మినరల్‌ ప్లాంట్‌ రిపేరులో ఉందని, పంచాయతీ కుళాయి కనెక్షన్‌ ద్వారా నీళ్లు రాకపోవటంతో నీటికి కొరతగా ఉందని విద్యార్థినులు, సిబ్బంది జడ్పీటీసీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన బుచ్చిబాబు వసతిగృహా లలోని సమస్యలను జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

Read more