అవగాహనతో శిశు మరణాలను తగ్గించొచ్చు

ABN , First Publish Date - 2022-11-08T01:26:50+05:30 IST

శిశు మరణాలను అవగాహనతోనే తగ్గించవచ్చని సీనియర్‌ సివిల్‌ జడ్జి, మండల్‌ లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఛైర్మన్‌ కె. జయలక్ష్మి అన్నారు. మండలంలోని బుద్ధవరం కేర్‌అండ్‌షేర్‌లో సోమవారం శిశు రక్షణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్డి జయలక్ష్మి మాట్లాడుతూ శిశువులను రక్షిం చటం భాద్యతగా తీసుకోవాలన్నారు. పిల్లలు ప్రపంచంలోనే అత్యంత విలువైన వనరు అని చెప్పారు.

అవగాహనతో శిశు మరణాలను తగ్గించొచ్చు

విద్యార్థులతో మాట్లాడుతున్న జడ్జి జయలక్ష్మి

గన్నవరం, నవంబరు 7 : శిశు మరణాలను అవగాహనతోనే తగ్గించవచ్చని సీనియర్‌ సివిల్‌ జడ్జి, మండల్‌ లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఛైర్మన్‌ కె. జయలక్ష్మి అన్నారు. మండలంలోని బుద్ధవరం కేర్‌అండ్‌షేర్‌లో సోమవారం శిశు రక్షణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్డి జయలక్ష్మి మాట్లాడుతూ శిశువులను రక్షిం చటం భాద్యతగా తీసుకోవాలన్నారు. పిల్లలు ప్రపంచంలోనే అత్యంత విలువైన వనరు అని చెప్పారు. తన బిడ్డను రక్షించే తల్లి కంటే గొప్ప యోధుడు ఎవరు ఉండరని చెప్పారు. అవ గాహన లేక ఎంతో మంది శిశువులను తల్లులు కోల్పోతున్నారని చెప్పారు. శిశు మరణాల రేటు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగానే ఉంటుంద న్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.సోమేశ్వర రావు, కేర్‌ అండ్‌ షేర్‌ ఇన్‌చార్జి డెన్నిస్‌ తదిత రులు పాల్గొన్నారు. అలాగే చిన అవుటపల్లి డాక్టర్‌ సి.శోభనాద్రి సిద్ధార్ధ నర్సింగ్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో కూడా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామకూరి కళ . ఎస్‌.శిరీషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T01:26:50+05:30 IST

Read more