మెడికల్‌ షాపు యజమాని అరెస్టు

ABN , First Publish Date - 2022-11-25T00:55:37+05:30 IST

వినియోగదారు ల క్రెడిట్‌ కార్డుల నుంచి ఎటువంటి ఖర్చులు లే కుండా నగదు తీసి ఇస్తూ క్రెడిట్‌ కార్డు సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందని ఆశచూపి క్రెడిట్‌ కార్డుల నుంచి ఆన్‌లైన్‌ రుణాలు తీసుకుని డబ్బు చెల్లించకుండా భారీ మోసానికి పాల్పడిన మెడికల్‌ షాపు యజమానిని సూర్యారావుపేట పోలీసులు అరెస్టు చేశారు.

మెడికల్‌ షాపు యజమాని అరెస్టు

వన్‌టౌన్‌, నవంబరు 24 : వినియోగదారు ల క్రెడిట్‌ కార్డుల నుంచి ఎటువంటి ఖర్చులు లే కుండా నగదు తీసి ఇస్తూ క్రెడిట్‌ కార్డు సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందని ఆశచూపి క్రెడిట్‌ కార్డుల నుంచి ఆన్‌లైన్‌ రుణాలు తీసుకుని డబ్బు చెల్లించకుండా భారీ మోసానికి పాల్పడిన మెడికల్‌ షాపు యజమానిని సూర్యారావుపేట పోలీసులు అరెస్టు చేశారు. విద్యాధరపురానికి చెందిన గార్లపాటి కార్తీక్‌ కుమార్‌ (33) పదో తరగతి వరకు చదివాడు. తరువాత తిరుపతిలో, విజయవాడ వన్‌టౌన్‌లో మెడికల్‌ షాపుల్లో కొంతకాలం పనిచేశాడు. తరువాత సూర్యారావుపేట పోలీసు స్టే షన్‌ పరిధిలోని సాంబమూర్తి రోడ్డులో అద్దెకు తీ సుకున్న షాపులో శ్రీధనలక్ష్మి మెడికల్‌ అండ్‌ ఫ్యాన్సీ షాపును నిర్వహిస్తూ క్రెడిట్‌ కార్డు మిషన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. మెడికల్‌ షాపునకు వచ్చిన వినియోగదారులకు వారి క్రెడిట్‌ కార్డులను తీసుకుని ఎటువంటి చార్జీలు తీసుకోకుండా డబ్బు తీసిచ్చేవాడు. ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని. సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందని నమ్మబలికాడు. తొలుత చిన్నమొత్తంలో డబ్బు లు డ్రా చేసి వాటిని కట్టేస్తూ అనంతరం పెద్ద మొత్తంలో నగదు తీసుకునేవాడు. అలాగే 32 మంది చేత బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేయుంచి సుమారు రూ.3కోట్ల వరకు తీసుకున్నా డు. జల్సాలు చేస్తూ, ఇంకా ఎక్కువ డబ్బు వ స్తుందన్న ఆశతో క్రిప్టో తదితరాలలో పెట్టుబడి పెట్టాడని, వచ్చిన డబ్బుతో ఏలూరు వెళ్లి ఒక హోటల్‌లో జల్సాలు చేసేవాడు. తనపై బాధితు లు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకుని ఒక న్యాయవాదిని కలిసి కేసు నుంచి బయట పడదామనుకుని నగరానికి వచ్చి మధురానగర్‌ పప్పుల మిల్లు వద్ద తిరుగుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.10 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై వచ్చిన ఫిర్యాదు మేరకు సీపీ కాంతిరాణా ఆదేశాలమేర కు డీసీపీ విశాల్‌గున్నీ, సౌత్‌ ఏసీపీ డాక్టర్‌ బి.రవికిరణ్‌, సూర్యారావుపేట సీఐ జానకిరామయ్య, ఎస్‌ఐ ఆర్‌ గోపాల్‌ పూర్తి విచారణ చేశారు.

Updated Date - 2022-11-25T00:55:37+05:30 IST

Read more