కట్లేరు వంతెనపై తాత్కాలిక రాకపోకలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-10-11T06:11:05+05:30 IST

కట్లేరుపై దెబ్బతిన్న వంతెనను ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్‌మోషే సోమవారం పరిశీలించారు.

కట్లేరు వంతెనపై తాత్కాలిక రాకపోకలకు ఏర్పాట్లు
దెబ్బతిన్న వంతెనను పరిశీలిస్తున్న ఆర్‌ అండ్‌బీ అధికారులు

ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్‌మోషే  

గంపలగూడెం, అక్టోబరు 10: కట్లేరుపై దెబ్బతిన్న వంతెనను ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్‌మోషే సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన వద్ద పరిస్థితిని పరిశీలించామని, తాత్కాలికంగా రాకపోకలకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అంచనాలు వేయాలని ఏఈని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ ఏడుకొండలు, రోజా కుమారి, అచ్చారావు, వైసీపీ నాయకులు గౌరసాని శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. 

Read more