AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-13T11:54:48+05:30 IST

ఏపీ మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో భేటీ అయిన కేబినెట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

అమరావతి: ఏపీ మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో భేటీ అయిన కేబినెట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఎస్ఐపీబీ (SIPB)లో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు తదితర అంశాలపై చర్చించి.. ఆమోదం తెలిపే అవకాశముంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపైనా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. కొందరు మంత్రుల పనితీరుపై గతంలోనే సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే మంత్రులను మారుస్తామని హెచ్చరికలు కూడా చేశారు.

క్యాబినెట్‌ భేటీలో మంత్రుల పనితీరుపై చర్చించే అవకాశముంది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మంత్రులు జిల్లాల్లో.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సీఎం జగన్ ఆదేశించనున్నారు. విపక్షాల కౌంటర్లకు దీటుగా సమాధానం ఇవ్వాలని మంత్రులకు సూచించే అవకాశముంది. మాండూస్ తుఫాన్ ప్రభావం, పంటలకు వాటిల్లిన నష్టంపై చర్చించనున్నారు. కేబినెట్ తర్వాత ముఖ్యమంత్రి కాసేపు మంత్రులతో విడిగా సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక హోదా, పోలవరంపై కేంద్ర ప్రకటనపై చర్చించే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2022-12-13T11:54:52+05:30 IST