అన్నదానం అభినందనీయం: ఎమ్మెల్యే గద్దె

ABN , First Publish Date - 2022-09-30T05:49:53+05:30 IST

కనకదుర్గ అమ్మవారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు.

అన్నదానం  అభినందనీయం: ఎమ్మెల్యే గద్దె
అన్నదానం చేస్తున్న గద్దె రామ్మోహన్‌

అన్నదానం  అభినందనీయం: ఎమ్మెల్యే గద్దె 

మాచవరం, సెప్టెంబరు 29 : కనకదుర్గ అమ్మవారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. 6వ డివిజన్‌ మారుతీనగర్‌లో గురువారం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన అన్నదానం చేశారు. అనంతరం అన్నదానానికి తన వంతుగా రూ. 10 వేలు విరాళాన్ని అందజేశారు. అనంతరం నిమ్మతోట ప్రాంతంలో ఇటీవల అనారోగ్యానికి గురైన మల్లవల్లి లక్ష్మీ ప్రసన్నకు గద్దె రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. డివిజన్‌ పార్టీ నాయకులు పడాల గంగాధర్‌, అప్పరబోతు రాము, పడాల రామారావు, పాల్గొన్నారు. 

Read more