అన్న క్యాంటీన్ల రద్దు దుర్మార్గం

ABN , First Publish Date - 2022-11-23T00:55:00+05:30 IST

టీడీపీ ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకు చక్కటి భోజనాన్ని అందించిన అన్న క్యాంటీన్ల విధానాన్ని జగన్‌ ప్రభుత్వం ర ద్దు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహ న్‌ అన్నారు.

అన్న క్యాంటీన్ల రద్దు దుర్మార్గం

ఆటోనగర్‌, నవంబరు 22 : టీడీపీ ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకు చక్కటి భోజనాన్ని అందించిన అన్న క్యాంటీన్ల విధానాన్ని జగన్‌ ప్రభుత్వం ర ద్దు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహ న్‌ అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల సందర్భంగా టీడీపీ నేత కేశినేని శివనాథ్‌ ఆటోనగర్‌ మసీ దు రోడ్డులో ఏర్పాటు చేసిన మొబైల్‌ అన్న క్యాంటీన్‌లో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ అన్నదానం అవశ్యకతను టీడీపీ పార్టీయే గుర్తించిందని, మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత అన్నదానం ప్రారంభించి భక్తుల ఆకలి తీర్చారన్నారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు గత ప్రభుత్వంలో కనదుర్గమ్మ గుడిలో ఉచిత ఉన్నదానాన్ని ప్రారంభించారని, తర్వాత కార్మికులకు, పేదవారికి తక్కువ ధరకే భోజనం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించారన్నారు. పేదలకు ఉపాధి దూరం చేసి, తక్కువ ఖర్చుతో ప్రభుత్వం ద్వారా లభ్యమయ్యే భోజనాన్ని రద్దు చేసి జగన్‌ పేదల ఉసురు కట్టుకున్నారని విమర్శించారు. తమిళనాడులో జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను ప్రస్తుత సీఎం స్టాలిన్‌ పేరు కూడా మార్చకుండా కొనసాగిస్తున్నారన్నారు. గొల్లపూడి నాగేశ్వరరావు, కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌, బత్తుల దుర్గారావు, షేక్‌ ఇబ్రహీం, గద్దె ప్రసాద్‌, పేరేపి ఈశ్వర్‌, కర్రి ఉమామహేశ్వరి, రాధారపు యల్లబాబు, యలమంచిలి రవీంద్ర పాల్గొన్నారు.

కావాలనే అన్న క్యాంటీన్లు తొలగింపు : బుద్దా

కేదారేశ్వరపేట : టీడీపీ హయాంలో ప్రజల చెంతకు ఎంతో ఉన్నతంగా చేరిన అన్న క్యాంటీన్‌లను కావాలనే వైసీపీ ప్రభుత్వం తొలగించిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా విమర్శించారు. టీడీపీ నేత, కేశినేని ఫౌండేషన్‌ ట్రస్టీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఆధ్వర్యంలో స్థానిక కేదారేశ్వరపేట, పండ్ల మార్కెట్‌ వద్ద మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా అన్నదానాన్ని ప్రారంభింయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవంతమైన అన్న క్యాంటీన్లను కావాలనే వైసీపీ ప్రభుత్వం తొలగించి పేదలు, అభాగ్యులు, నిరాశ్రయుల పొట్టను కొట్టిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన నడుస్తోందని, ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నవరత్నాల ముసుగులో ప్రజలను మోసం చేయాలని చూశారని, కానీ ప్రజలు మాయరత్నాలని గ్రహించారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గద్దె దించి, టీడీపీ జెండాను ఎగురవేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలందరూ చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, ఎప్పుడు మంచిరోజులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. నేతలు హనుమంతరావు, సాధరబోయిన ఏడుకొండలు, గణప రాము, కామా దేవరాజు, గుర్రం కొండ, పేరాబత్తుల రమణ, నాగోతి రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:55:00+05:30 IST

Read more