ఆగిన అక్రమ తవ్వకాలు

ABN , First Publish Date - 2022-03-16T06:05:26+05:30 IST

ఆగిన అక్రమ తవ్వకాలు

ఆగిన అక్రమ తవ్వకాలు

విజయవాడ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : కొత్తూరు తాడేపల్లి, వేమవరం గ్రామాల వద్ద కొండ ప్రాంతంలో జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలు ఆగిపోయాయి. అన్ని అనుమతులతోనే తవ్వుతున్నామని చెప్పిన యజమాని ఇప్పుడు తవ్వకాలకు విరామం ఇచ్చారు. ఈ గ్రావెల్‌ తవ్వకాలపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘మెగా ముసుగులో దోపిడీ’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. తవ్వకాల వ్యవహారం వెలుగులోకి రావడంతో క్వారీ యజమానులు దుకాణం సర్దుకున్నారు. కొండ ప్రాంతంలో ఉన్న ఎక్స్‌కవేటర్లను అక్కడి నుంచి తరలించేశారు. లారీలు అటుగా వెళ్లకుండా ట్రాన్స్‌పోర్టు కంపెనీల వద్దకు మళ్లించారు. 

Read more