-
-
Home » Andhra Pradesh » Krishna » ander pass vadha gothulu-NGTS-AndhraPradesh
-
అండర్ పాస్‌ల వద్ద గోతులు
ABN , First Publish Date - 2022-09-19T06:03:45+05:30 IST
అండర్ పాస్‌ల వద్ద గోతులు

ఉయ్యూరు, సెప్టెంబరు 18 : విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహ దారిలో ఉయ్యూరు మండల పరిధి గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన అండర్ పాస్‌ల వద్ద వర్షపు నీరు పోయేమార్గం లేక గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆకునూరు, గండిగుంట, ఉయ్యూరు, మంటాడ, తాడంకి గ్రామాల వద్ద వాహనాలు ఓ వైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు అండర్‌పాస్‌లు ఏర్పాటు చేశారు. వీటివద్ద వర్షపునీరు పోయేం దుకు మార్గం లేకపోవడంతో అక్కడే నిలిచిపోతుంది. దీంతో అండర్‌పాస్‌ల వద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా తయారయ్యాయి. జాతీయ రహదారి విస్తరణ సందర్భంగా అండర్ పాస్‌లు నిర్మించే సమయంలో అక్కడ నీరు పోయేందుకు సదుపాయం ఏర్పాటు చేయకపోవడంతో వర్షపు నీరు నిలిచి అసౌకర్యం కలుగుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవచూపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయా ప్రాంత ప్రజలు కోరుతున్నారు.