అత్యాచారాల నిందితులకు స్వేచ్ఛ తగదు!

ABN , First Publish Date - 2022-08-25T06:15:18+05:30 IST

అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట ఒకపక్క ఉత్సవాలు చేస్తున్న బీజే పీ ప్రభుత్వం మరోపక్క మహిళలపై అత్యాచారాలను ప్రోత్సహించే రీతిలో అత్యాచార నిందితులను బయటకు వదిలిపెడుతోందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, శ్రామిక మహిళా రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ విమర్శించారు.

అత్యాచారాల నిందితులకు స్వేచ్ఛ తగదు!

ఐద్వా నేతలు

మధురానగర్‌, ఆగస్టు 24 : అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట ఒకపక్క ఉత్సవాలు చేస్తున్న బీజే పీ ప్రభుత్వం మరోపక్క మహిళలపై అత్యాచారాలను ప్రోత్సహించే రీతిలో అత్యాచార నిందితులను బయటకు వదిలిపెడుతోందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, శ్రామిక మహిళా రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ విమర్శించారు. ఐద్వా సెంట్రల్‌ కమిటీ 13వ మ హాసభలో భాగంగా ప్రతినిధుల సభ మధురానగర్‌ లో బుఽధవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాత్‌లో బిల్కీస్‌ బానో అత్యాచార ఘటనలో నిందితులకు స్వేచ్ఛ ఇవ్వడం, మహిళలపై అత్యాచారాలు పెరగడం, నిందితులకు శిక్షలువేయడంలో ఆ లస్యం జరగడం ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవ డం లేదన్నారు. అనంతరం 16 మందితో ఐద్వా సెంట్ర ల్‌ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా కె.సరోజ, జి.ఝాన్సీరాణి, ఆఫీసు బేరర్స్‌గా బి.విజయ, షకీలా, సుజాత, దేవికుమారి, ఆషా, అమ్ములు, శివపార్మతితో పాటు మరికొందరిని కమిటీ సభ్యులుగా ఎన్ను కున్నారు. ఆరోగ్య కేంద్రాల సమస్యలను పరిష్కరించాలని, విచ్చలవిడి మద్యం అమ్మకాలను నిరోధించాలని ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. ఐద్వా రాష్ట్ర నేతలు కె.స్వరూప రాణి, శ్రామిక మహిళా జిల్లా నేతలు సుప్ర జ, ఐద్వా జిల్లా కార్యదర్శి శ్రీదేవి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-25T06:15:18+05:30 IST