రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

ABN , First Publish Date - 2022-07-18T06:05:43+05:30 IST

పొట్టకూటి కోసం చేపల వేట చేస్తూ జీవిస్తున్న భార్యాభర్తలిరువురూ ఆదివారం గూడూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

మచిలీపట్నం టౌన్‌, జూలై 17 : పొట్టకూటి కోసం చేపల వేట చేస్తూ జీవిస్తున్న భార్యాభర్తలిరువురూ ఆదివారం గూడూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మచిలీపట్నం దేవుడితోటకు చెందిన వీరిరువురు గూడూరులో చేపల వేట చేసుకుంటున్న వీరిద్దరిని కారు ఢీకొనడంతో వీరు మృతిచెందారు. ఈ ఘటన మచిలీపట్నం, గూడూరు ప్రాంతాల్లో సంచలనం రేకెత్తించింది. సంచార జాతులకు చెందిన పేదవారైన పొన్నూరు ముసలయ్య (57), చెంచమ్మ (55) గూడూరు బోదెల్లో చేపలు పట్టుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. మచిలీపట్నం నుంచి పోలీసు అధికారులు హుటాహుటి గూడూరు వెళ్ళారు. డీఎస్పీ మాసూంబాషా, సీఐ వీరయ్య గౌడ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Read more