ఎక్స్‌ల్ ప్లాంట్‌లో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2022-12-13T00:49:44+05:30 IST
అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎక్సెల్ ప్లాంట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎక్స్‌ల్ ప్లాంట్‌లో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
ఫ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్
అజిత్‌సింగ్‌నగర్, డిసెంబరు 12 : అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎక్సెల్ ప్లాంట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగ్‌నగర్‌లోని ఎక్సెల్ ప్లాంట్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాంట్‌లో నూతనంగా రెండు గేట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎంట్రన్స్ రోడ్డు నుంచి వేబ్రిడ్జి వరకు రోడ్లు నిర్మించాలని సూచించారు. అదనపు కమిషనర్ కెవి. సత్యవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read more