-
-
Home » Andhra Pradesh » Krishna » A statue of Kakani should be installed at Benji Circle-NGTS-AndhraPradesh
-
బెంజి సర్కిల్ వద్ద..‘కాకాని’ విగ్రహం ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2022-09-08T06:40:51+05:30 IST
బెంజి సర్కిల్ వద్ద..‘కాకాని’ విగ్రహం ఏర్పాటు చేయాలి

లబ్బీపేట, సెప్టెంబరు 7: ఫ్లై ఓవర్ల నిర్మాణంలో భాగంగా బెంజి సర్కిల్ వద్ద తొలగించిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపకుడు కాకాని తరుణ్, సభ్యులు బుధ వారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు వినతిపత్రం అందజేశారు. బెంజిసర్కిల్ వద్ద రెండు ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తయ్యాక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ రాత పూర్వక హామీ ఇచ్చారని గవర్నర్‌కు తెలిపి, ఆ పత్రాలను సమర్పిం చామని తరుణ్ తెలిపారు. నిర్మాణాలు పూర్తై చాలా రోజులు కావస్తున్నా విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై పలుమార్లు అధికారులను కలిసినా స్పందన లేదని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. 1972లో ప్రభుత్వం ఆ సర్కిల్‌ను కాకాని సర్కిల్‌గా నామ కరణం చేసిందని, కాలక్రమేణా అక్కడ బెంజి కంపెనీ రావడంతో బెంజి సర్కిల్‌గా పిలుస్తున్నారని, ప్రస్తుతం అక్కడ అ కంపెనీ లేదని మళ్లీ అక్కడ విగ్రహం ఏర్పాటు చేసి, కాకాని సర్కిల్‌గా నామకరణం చేయా లని అధికారులను అదేశించాలని గవర్నర్ కోరినట్లు తెలిపారు. సమితి చైర్మన్ కోనేరు విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు కోనేరు మధు పాల్గొన్నారు.