రాష్ట్రాన్ని దగా చేసిన కేంద్రం

ABN , First Publish Date - 2022-09-29T06:43:08+05:30 IST

రాష్ట్రాన్ని దగా చేసిన కేంద్రం

రాష్ట్రాన్ని దగా చేసిన కేంద్రం
నిరసన తెలుపుతున్న సీపీఎం నేతలు, కార్యకర్తలు

గవర్నర్‌పేట, సెప్టెంబరు 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోసారి దగా చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వ ర్యంలో బుధవారం బీసెంట్‌ రోడ్డు అన్సారీ పార్కు వద్ద సీపీ ఎం నాయకులు నిరసన తెలిపారు. రాజధానికి నిధులు ఇవ్వ కుండా, రైల్వేజోన్‌ మంజూరు చేయకుండా మోదీ ప్రభుత్వం మోసం చేసిందని, కేంద్ర వైఖరిని ఎండగట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఊసే కేంద్రం ఎత్తడం లేదని, ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదాలు పరిష్కరించకుండా కేంద్రం ప్రేక్షకపాత్ర వహిస్తోందన్నారు. విభజన చట్టాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించినా వైసీపీ నోరు మెదపడం లేదన్నారు. బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై ఇప్పటికైనా అధికార, ప్రతిపక్ష పార్టీలు గళం విప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీ హక్కుల సాధనకోసం కేంద్రంపై నిరంతరం పోరు సాగి స్తామని, ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిరసనలో నేతలు దోనేపూడి కాశీనాథ్‌, బి.రమణారావు, కె.దుర్గారావు, కె.సరోజ, కోటి, సీహెచ్‌ శ్రీనివాస్‌, వై.సుబ్బారావు, పి.కృష్ణమూర్తి, గురుమూర్తి, మురహరి పాల్గొన్నారు.Read more