మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనానికి రూ.6 కోట్లు

ABN , First Publish Date - 2022-09-24T06:44:52+05:30 IST

మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనానికి రూ.6 కోట్లు

మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనానికి రూ.6 కోట్లు
పూర్వ విద్యార్థులు సమకూర్చిన బస్సును అందజేస్తున్న కృష్ణబాబు

కళాశాలకు బస్సు అందజేసిన పూర్వవిద్యార్థులు

మాచవరం, సెప్టెంబరు 23: సిద్ధార్థ మెడికల్‌ కళాశాల హాస్టల్‌ భవన నిర్మాణానికి రూ.6 కోట్లను వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు మంజూరు చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయ ఆవ రణలో కృష్ణబాబు చేతుల మీదుగా ప్రిన్సిపాల్‌ విఠలరావుకు సిద్ధార్థ మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థులు బస్సును అందజేశారు. హాస్టల్‌ భవన నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని డాక్టర్‌ అమ్మన్న కోరగా సానుకూలంగా స్పందిం చిన కృష్ణబాబు రూ.6 కోట్లు మంజూరు చేశారు. మెడికల్‌ కళాశాలకు మరో నెలలో మరో కొత్త బస్సును అందిస్తామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు శివప్రసాద్‌, అట్లూరి స్వప్న, నలమాటి శ్రీలక్ష్మి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. Read more