20 టన్నుల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-09-30T06:15:11+05:30 IST

అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్‌ బియ్యం లారీని రింగ్‌ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

20 టన్నుల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీ

 లారీ సీజ్‌  

 ఇద్దరిపై కేసు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 29: అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్‌ బియ్యం లారీని రింగ్‌ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. రింగ్‌ సెంటర్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరులపాడు మండలం జయంతి గ్రామం నుంచి కాకినాడ పోర్టు వెళుతున్న ఏపీ 05టీవీ 4489 నెంబరు లారీలో బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కాకినాడకు చెందిన లారీ యజమాని వై.కృష్ణ, బియ్యం తరలింపునకు కారణమైన శివదీప్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీను తెలిపారు.

Read more