100 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-09-24T06:33:49+05:30 IST

వేమిరెడ్డిపల్లి శివారు నూతిపాడులో మిరియాల రామారావు ఇంటి వద్ద

100 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం
స్వాధీనం చేసుకున్న బియ్యం

 విస్సన్నపేట: వేమిరెడ్డిపల్లి శివారు నూతిపాడులో మిరియాల రామారావు ఇంటి వద్ద శుక్రవారం సివిల్‌ సఫ్లై అధికారులు దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో 100 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని గుర్తించి సీజ్‌ చేసినట్లు డీటీ శివ నాగరాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానిక డీలర్‌కు వద్ద భద్రపరిచినట్లు చెప్పారు. దాడుల్లో వీఆర్వో నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

ఎ.కొండూరు, సెప్టెంబరు 23 : ఎదురింటి వారు దుషించారని మనస్తాపం  చెందిన  మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన. తిరువూరు ఏసీపీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ తెల్పిన వివరాల ప్రకారం ఎ.కొండూరుకు చెందిన బ్రహ్మగారి జామతోటలో తుమ్మల రాజు అతని భార్య సుమలత  కాపలా ఉంటున్నారు. గురువారం రాత్రి సుమలత తన కుమారైను పాతకొండూరు గ్రామ సీసీ రోడ్డు పక్కన బహిర్భూమికి వెళ్లిన విషయంలో ఎదురుగా నివాసం ఉంటున్న యలమంచిలి శ్రీనివాసరావు, కిషోర్‌లు సుమలతను దుషించారు. దాంతో మన స్తాపం చెందిన సుమలత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పుడింది. మృతురాలి భర్త రాజు ఫిర్యాదు మేరుకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ తెలిపారు.


Read more