Krea University: కొత్త అకాడమీ బ్లాక్‌ను ప్రారంభించిన క్రియా యూనివర్సిటీ

ABN , First Publish Date - 2022-08-29T02:18:43+05:30 IST

తిరుపతిలోని శ్రీసిటీలో క్రియా యూనివర్సిటీ (Krea University) తన కొత్త అకడమిక్ బ్లాక్‌‌ను ప్రారంభించింది.

Krea University: కొత్త అకాడమీ బ్లాక్‌ను ప్రారంభించిన క్రియా యూనివర్సిటీ

శ్రీసిటీ: తిరుపతిలోని శ్రీసిటీలో క్రియా యూనివర్సిటీ (Krea University) తన కొత్త అకడమిక్ బ్లాక్‌‌ను ప్రారంభించింది.  కేంద్ర  విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్, గవర్నింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కపిల్ విశ్వనాథన్, ప్రొఫెషనల్ లెర్నింగ్ ప్రో వైస్-ఛాన్సలర్ రామ్‌కుమార్ రామమూర్తి, డాక్టర్ లక్ష్మీ కుమార్, డీన్ (IFMR GSB)తోపాటు క్రియాలోని ఇతర సభ్యుల సమక్షంలో ప్రారంభించారు.


25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కొత్త అకాడమిక్ బ్లాక్‌లో కొత్త లైబ్రరీ, ఫిజిక్స్, బయోసైన్సెస్, కెమిస్ట్రీ కోసం మూడు రీసెర్చ్ ల్యాబ్‌లు ఉన్నాయి. అలాగే, పదివేల  చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లైబ్రరీలో లక్షకు పైగా పుస్తకాలు ఉన్నాయి. చర్చా గదులు, వర్క్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా యూనివర్సిటీలోని పరిశోధనా ఫ్యాకల్టీల కోసం దీనిని ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-29T02:18:43+05:30 IST