మురుగునీటి కాలువలోకి దిగిన kotamreddy

ABN , First Publish Date - 2022-07-05T16:13:49+05:30 IST

రైల్వే, మున్సిపల్ అధికారుల తీరుని నిరసిస్తూ మురుగునీటి కాలువలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) దిగారు.

మురుగునీటి కాలువలోకి దిగిన kotamreddy

Nellore : రైల్వే, మున్సిపల్ అధికారుల తీరుని నిరసిస్తూ మురుగునీటి కాలువలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) దిగారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటంరెడ్డి 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ(Drainage) సమస్య ఎక్కువగా ఉందన్నారు. వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతోందని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎప్పుడో ప్రశ్నించానన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి కూడా అధికారులతో మాట్లాడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అధికారమా? ప్రతిపక్షమా? అనేది ఉండదని.. ప్రజల పక్షాన ఉంటానన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. తాను కూడా బాధపడుతున్నానన్నారు. రైల్వే అధికారుల మొండి తీరు, కార్పొరేషన్ అధికారుల నత్తనడకని ప్రశ్నిస్తూ మురుగు గుంతలోకి దిగుతున్నానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.


Read more