AP Deputy Speakerగా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవ ఎన్నిక

ABN , First Publish Date - 2022-09-19T18:24:35+05:30 IST

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కొలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.

AP Deputy Speakerగా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవ ఎన్నిక

అమరావతి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ (AP Assembly Deputy speaker)గా కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabhadraswamy ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఈ సందర్భంగా వీరభద్రస్వామిని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy), టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (Atchennaidu) కలిసి స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టారు. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి (AP Deputy speaker)కి శాసనసభ సభ్యులు అభినందనలు తెలియజేశారు. 


డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి (Pushpa Sri vani) మాట్లాడుతూ.... ‘‘మీలాంటి వ్యక్తికి డిప్యూటీ స్పీకర్ కావడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. విజయనగరం జిల్లాలో ఎవ్వరికి రాజ్యంగ బద్దమైన స్ధానంలో అవకాశం రాలేదన్నారు. ఉత్తరాంధ్ర నుండే స్పీకర్, డిఫ్యూటీ స్పీకర్ దక్కడం అరుదైన గౌరవమని పుష్పశ్రీవాణి (Deputy CM) చెప్పుకొచ్చారు. 


స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉత్తరాంధ్ర కే దక్కడ గర్వకారణం: బొత్స (Botsa satyanarayana)

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉత్తరాంధ్రాకే దక్కడ గర్వకారణమని అన్నారు. ఉపసభాపతిగా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఆయనకు అభినందలు తెలిపారు. సభ నిర్వహణలలో పట్టువిడుపులతో నడిపించాలని కోరారు. 


ఇకపై రాజకీయ పార్టీలతో సంభందం లేదని అనుకుంటున్నా: అచ్చెన్న

రెండు పర్యాయాలు శాసనసభ సభ్యులుగా, ఒక పర్యాయం శాసన మండలి సభ్యులుగా కోలగట్ల వీరభద్రస్వామికి అనుభవం ఉందని అన్నారు. ‘‘ప్రధానమైన రైతుల సమస్యలపై చర్చ ఉంది.... అయినా మీ ఎన్నిక ఉన్నందున టీడీపీ తరపున తమను గౌరవించుకుంటున్నాం. ఇకపై రాజకీయ పార్టీలతో సంభందం లేదని అనుకుంటున్నా. సభాపతి కుడిచేతి వైపే చూస్తారు మీరైనా ఎడమచేతి వైపు చూసి మాకు అవకావం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని అన్నారు. 




Updated Date - 2022-09-19T18:24:35+05:30 IST