తిరుపతిలో విచ్చలవిడిగా వైసీపీ భూకబ్జాలు: కిరణ్‌రాయల్

ABN , First Publish Date - 2022-03-16T18:02:07+05:30 IST

తిరుపతిలో విచ్చలవిడిగా వైసీపీ భూకబ్జాలకు పాల్పడుతోందని జనసేన నేత కిరణ్‌రాయల్ పేర్కొన్నారు. భూమి కనిపిస్తే ఏదో రకంగా కబ్జా చేస్తున్నారన్నారు.

తిరుపతిలో విచ్చలవిడిగా వైసీపీ భూకబ్జాలు: కిరణ్‌రాయల్

తిరుపతి : తిరుపతిలో విచ్చలవిడిగా వైసీపీ భూకబ్జాలకు పాల్పడుతోందని జనసేన నేత కిరణ్‌రాయల్ పేర్కొన్నారు. భూమి కనిపిస్తే ఏదో రకంగా కబ్జా చేస్తున్నారన్నారు. అధికార అండతో కార్పొరేటర్లు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వైసీపీ కార్పొరేటర్లు ఇకనైనా కబ్జాలు మానుకోవాలని కిరణ్‌రాయల్ హితవు పలికారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను సీఎంగా చూడాలని ప్రజల కోరిక అని పేర్కొన్నారు. పవన్ సభకు వెళ్తున్న జనసైనికులపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. రానున్న రోజుల్లో జగన్‌రెడ్డిని రోడ్డుపైకి తీసుకొస్తామని కిరణ్‌రాయల్ పేర్కొన్నారు.

Read more