వచ్చే నెలలో బెజవాడకు కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-09-17T09:57:33+05:30 IST

వచ్చే నెలలో బెజవాడకు కేసీఆర్‌

వచ్చే నెలలో బెజవాడకు కేసీఆర్‌

సీపీఐ జాతీయ మహాసభలకు హాజరు

స్టాలిన్‌, నితీశ్‌, పినరయి కూడా

తెలంగాణలో టీఆర్‌ఎస్‌-లెఫ్ట్‌ పొత్తు!


అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చే నెలలో విజయవాడకు రానున్నారు. అక్టోబరు 14నుంచి18 వరకు ఇక్కడ జరిగే సీపీఐ జాతీయ మహాసభలకు ఆయన హాజరవుతారు. మహాసభల్లో భాగంగా 16 17 తేదీల్లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంశాలపై సెమినార్‌ జరుగనుంది, దీనికి కేసీఆర్‌తో పాటు తమిళనాడు, కేరళ, బిహార్‌ సీఎంలు స్టాలి న్‌, పినరయి విజయన్‌, నితీశ్‌కుమార్‌ కూడా హాజరు కావడానికి సుముఖత వ్యక్తంచేసినట్లు వెల్లడించాయి. 

Read more