AP News: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కరణం ధర్మశ్రీ భేటీ

ABN , First Publish Date - 2022-11-02T12:17:23+05:30 IST

కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని ఏపీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ బుధవారం భేటీ అయ్యారు.

AP News: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కరణం ధర్మశ్రీ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari)ని ఏపీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ (Karanam Dharma sri) బుధవారం భేటీ అయ్యారు. సబ్బవరం - తుని రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలంటూ ఈ సందర్భంగా కేంద్రమంత్రి (Union minister)కి కరణం వినతి చేశారు. అనంతరం ఏపీ ప్రభుత్వ విప్ (AP Government whip)మీడియాతో మాట్లాడుతూ... సబ్బవరం - తుని రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని అన్నారు. 133 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి రూ.2200 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ రహదారి పనులు వేగంగా చేయాలని గడ్కరీని కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ రహదారితో ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. డీపీఆర్ కూడా ఇప్పటికే పూర్తైందన్నారు. ఈ అంశంపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని కరణం ధర్మశ్రీ తెలిపారు.

Updated Date - 2022-11-02T12:17:24+05:30 IST