Delhi Liquor Scam: రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర కనికారెడ్డి హల్‌చల్

ABN , First Publish Date - 2022-11-17T16:32:09+05:30 IST

రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో అరెస్టైన శరత్‌చంద్రారెడ్డి (Sarath Chandra Reddy) భార్య కనికారెడ్డి హల్‌చల్ చేశారు.

Delhi Liquor Scam: రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర కనికారెడ్డి హల్‌చల్
Kanika Reddy

ఢిల్లీ: రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liquor Scam)లో అరెస్టైన శరత్‌చంద్రారెడ్డి (Sarath Chandra Reddy) భార్య కనికారెడ్డి హల్‌చల్ చేశారు. లిక్కర్ స్కామ్‌ కేసులో శరత్‌చంద్రారెడ్డిని కోర్టుకు ఈడీ అధికారులు తీసుకొచ్చారు. శరత్‌చంద్రారెడ్డిని చూసేందుకు కోర్టుకు కనికారెడ్డి వచ్చారు. కోర్టు దగ్గర ఫొటో తీయడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులకు ఆమె వార్నింగ్ ఇచ్చారు. తన ఫొటోలు తీస్తే కేసు పెడతానని బెదిరించారు. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరో లింకు బయటపడిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో డబ్బు హవాలా మార్గంలోనే కాక.. బేగంపేట విమానాశ్రయం నుంచి ‘హవా’ (విమాన) మార్గంలో కూడా దేశంలోని పలుప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిపోయినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైందని తెలుస్తోంది. ఈ వాయురవాణా వెనుక కీలక సూత్రధారి కనికారెడ్డి అని ఈడీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె సంస్థకు చెందిన చార్టర్డ్‌ విమానాల్లోనే హైదరాబాద్‌ (Hyderabad)లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు నగదును తరలించారని నిరూపించే ప్రాథమిక ఆధారాలు ఈడీకి లభ్యమైనట్టు తెలిసింది. దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల తరహాలో.. బేగంపేట విమానాశ్రయంలో స్ర్కీనింగ్‌ పాయింట్లు లేకపోవడం, వీఐపీల వాహనాలు నేరుగా రన్‌వేపై విమానాల దగ్గరి దాకా వెళ్లే వీలుండడం వంటి వెసులుబాట్లను ఇందుకు ఉపయోగించుకున్నట్లు ఈడీ భావిస్తోంది.

Updated Date - 2022-11-17T16:32:10+05:30 IST