మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ

ABN , First Publish Date - 2022-10-05T01:17:50+05:30 IST

బెజవాడ కనకదుర్గమ్మ మహర్నవమి రోజున మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ మహర్నవమి రోజున మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బారులు తీరారు. అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్ర్తాలను సమర్పించారు. బుధవారం విజయదశమి సందర్భంగా సాయంత్రం కృష్ణా నదిలో నిర్వహించే తెప్పోత్సవాన్ని శాస్త్రయుక్తంగా మాత్రమే నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి భక్తులను మాత్రం అనుమతించరు. నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున హంస వాహనాన్ని దుర్గా ఘాట్‌ వద్ద మాత్రమే కొంతదూరం తిప్పుతారు. నదీ విహారం ఉండదు.

Read more