జగన్ పాలనలో మహానుభావుల విగ్రహాలకూ రక్షణ కరవు: కాల్వ

ABN , First Publish Date - 2022-01-03T18:33:35+05:30 IST

దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దేబ్బతీయడమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.

జగన్ పాలనలో మహానుభావుల విగ్రహాలకూ రక్షణ కరవు: కాల్వ

అనంతపురం : దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దేబ్బతీయడమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. వైసీపీ విధ్వంసక చర్యల కొనసాగింపుగానే విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. జగన్ ఆటవిక పాలనలో సామాన్యులతో పాటు మహానుభావుల విగ్రహాలకూ రక్షణ కరవైందన్నారు. సీఎం జగన్ తెలుగు ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పి, ప్రభుత్వ ఖర్చుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 

Read more