వైవీయూ వీసీని రీకాల్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-11-15T23:59:20+05:30 IST

వైవీయూలో వేమన విగ్రహాన్ని తొలగించడంపై చర్యలు తీసుకోవాలని వైస్‌చాన్సలర్‌ను రీకాల్‌ చేసే విధంగా సీఎం, గవర్నరుకు సిఫారసు చేయాలని పీడీఎ్‌సయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న, జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు కోరారు.

వైవీయూ వీసీని రీకాల్‌ చేయాలి

ఉప ముఖ్యమంత్రికి పీడీఎ్‌సయూ వినతి

కడప (ఎడ్యుకేషన), నవంబరు 15 : వైవీయూలో వేమన విగ్రహాన్ని తొలగించడంపై చర్యలు తీసుకోవాలని వైస్‌చాన్సలర్‌ను రీకాల్‌ చేసే విధంగా సీఎం, గవర్నరుకు సిఫారసు చేయాలని పీడీఎ్‌సయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న, జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు కోరారు. మంగళవారం కడప నగరం ఉప ముఖ్యమంత్రి నివాసంలో వారు డిప్యూటీ సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైవీయూ అధికారులు ఉద్దేశ్యపూర్వంగా వేమన విగ్రహా న్ని తొలగించారన్నారు వేమన విగ్రహాన్ని అవమానకర రీతిలో ప్రధాన ద్వారం బయట ప్రతిష్ఠించారని, అది కూడా చిన్నస్టేజీపై చిన్న విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. విశ్వకవి వేమనకు అవమానం జరిగిందని రాష్ట్రమంతా అంటుంటే రెండు వారాలు అయినా వీసీ మాత్రం నిర్లక్ష్యంగా ఉంటూ సమర్ధంచుకోవడం దుర్మార్గమన్నారు. తక్షణంవేమన విగ్రహానికి గౌరవం వచ్చేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎ్‌సయూ అన్నమయ్య జిల్లా జిల్లా నాయకులు స్వరూ్‌పతేజ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:59:20+05:30 IST

Read more