వైవీయూలో యువత సందడి

ABN , First Publish Date - 2022-12-13T23:31:10+05:30 IST

శాస్త్రీయ నృత్యాలు, కోలాటాలు, క్రీడలు మేధోపరచర్చలు, సినిమా పాటలు, స్టెప్పులతో యువత కదం తొక్కారు.

వైవీయూలో యువత సందడి
సాంస్కృతిక కార్యక్రమాల్లో వైవీయూ విద్యార్థులు

కడప (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 13: శాస్త్రీయ నృత్యాలు, కోలాటాలు, క్రీడలు మేధోపరచర్చలు, సినిమా పాటలు, స్టెప్పులతో యువత కదం తొక్కారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వేమన యూత్‌ ఫెస్ట్‌ 2కె22 పేరుతో యువజనోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. ఏపీజే అబ్దుల్‌కలాం ప్రాంగణలో మొదలైన యువజనోత్సవాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

విద్యార్థినుల కత్తి, కర్రసాము, సాహస క్రీడలను మరిపించాయి. శాస్త్రీయ నృత్యాలు, సంప్రదాయ కోలాట నృత్యాలు కట్టిపడేశాయి. విజేతలకు ప్రొఫెసర్లు పద్మ, శ్రీనివాస్‌, కల్చరల్‌ కమిటీ సమన్వయకర్త ప్రొఫెసర్‌ రాంప్రసాద్‌రెడ్డి, క్విజ్‌ కన్వీనరు సరిత, ప్రొఫెసర్‌ మధుసూదనరెడ్డి, బహుమతులు అందించారు.

Updated Date - 2022-12-13T23:31:10+05:30 IST

Read more