వైసీపీ ఖజానా ఫుల్‌..ప్రభుత్వ ఖజానా నిల్‌..

ABN , First Publish Date - 2022-05-31T05:26:33+05:30 IST

అవినీ తి అక్రమాలతో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు వారి ఖజానాను నింపుకుం టూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసేశారని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి,మాజీ జడ్పీటీసీ వలిగట్ల వెంకటరమణలు ఆరో పించారు.

వైసీపీ ఖజానా ఫుల్‌..ప్రభుత్వ ఖజానా నిల్‌..
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

వాల్మీకిపురం, మే 30: అవినీ తి అక్రమాలతో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు వారి ఖజానాను నింపుకుం టూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసేశారని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి,మాజీ జడ్పీటీసీ వలిగట్ల వెంకటరమణలు ఆరో పించారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మద్యం, మైనింగ్‌, ఇసుక, ఎర్రచందనం ఏదిపడితే అది అడ్డుగోలుగా అవినీతికి పాల్పడి సొమ్ము చేసుకుంటున్నారే తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోలేదని విమర్శించారు. ఒంగోలులో టీడీపీ మహానాడు దిగ్విజయం కావడం జీర్ణించుకోలేని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అక్కసు వెళ్లబోస్తున్నారన్నారు.  కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు బొక్కసం రామకృష్ణ, పీలేరు మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌బాషా, నాయకులు పీవీ నారాయణ, చంద్రమౌళి, డిష్‌ బ్రదర్స్‌, చాను, సాదిక్‌, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు. 


Read more