చెత్త బ్లాక్‌స్పాట్స్ గుర్తింపు
ABN , First Publish Date - 2022-11-11T23:40:02+05:30 IST
పాఠశాలలు, రస్తాలు, ప్రజలు రద్దీగా ఉన్నచోట ఇళ్లలోని చెత్త, కంపుకొట్టే వేస్టేజీని వేయరాదని నగరపంచాయతీ అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎర్రగుంట్ల, నవంబరు 11: పాఠశాలలు, రస్తాలు, ప్రజలు రద్దీగా ఉన్నచోట ఇళ్లలోని చెత్త, కంపుకొట్టే వేస్టేజీని వేయరాదని నగరపంచాయతీ అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎర్రగుంట్ల నగరపంచాయతీలోని పోలీసుస్టేషన్ పక్కనే ఉన్న ఉర్దుస్కూల్, బస్టాండు, బాలుర ఉన్నతపాఠశాల, క్రీడామైదానం వద్ద సమీప వీధుల్లోని ప్రజలు అపరిశుభ్రం చేస్తున్నారని వారిలో మార్పురావాలని అక్కడి ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి వాటిని గ్రీన్ స్పాట్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేశారు. శుక్రవారం బ్లాక్ స్పాట్స్‌లోని అపరిశుభ్రాలను తొలగించి రంగవల్లులు వేసి పూలకుండీలను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశాలను సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అపరిశుభ్రం చేయరాదని కమిషనర్ పి.జగన్నాథ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మధుకుమార్, ఇంజినీర్ సందీప్ ప్రజలను కోరారు. టౌన్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు.
Read more