‘మోదీ పాలనలోనే మహిళా సాధికారత’

ABN , First Publish Date - 2022-09-18T04:32:40+05:30 IST

దేశ ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే మహిళాసాధికారత లభించిందని భారతీయ జనతా పార్టీ కిసాన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంగళ శశిభూషణ్‌రెడ్డి కొనియాడారు.

‘మోదీ పాలనలోనే మహిళా సాధికారత’

 కడప (మారుతీనగర్‌), సెప్టెంబరు 17: దేశ ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే మహిళాసాధికారత లభించిందని భారతీయ జనతా పార్టీ కిసాన  మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంగళ శశిభూషణ్‌రెడ్డి కొనియాడారు. నరేంద్రమోదీ 72వ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొ ని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బత్తల పవనకుమార్‌, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బొమ్మన విజయ్‌ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎనజీఓ కాలనీ గంగమ్మ గుడి సమీపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శశిభూషణ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు బాలకృష్ణయాదవ్‌, హరినారాయణరావు, మునగా సతీష్‌, మహిళా నాయకురాలు గద్దే సరస్వతి, పద్మావతిభాయి, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. 

Read more