-
-
Home » Andhra Pradesh » Kadapa » Woman killed after falling under bus-MRGS-AndhraPradesh
-
బస్సు కింద పడి మహిళ దుర్మరణం
ABN , First Publish Date - 2022-02-20T04:39:14+05:30 IST
కడప నగరంలోని నాగరాజుపేటలో శనివారం మ ధ్యాహ్నం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు కింద పడి ఓ మహి ళ మృతి చెందింది.

కడప(క్రైం), ఫిబ్రవరి 19 : కడప నగరంలోని నాగరాజుపేటలో శనివారం మ ధ్యాహ్నం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు కింద పడి ఓ మహి ళ మృతి చెందింది. విష యం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని ఘట నపై ఆరా తీశారు. ఎస్ఐ వివరాల మేరకు... ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వద్దిరెడ్డి భాగ్యలక్ష్మి (53) భర్త రామలింగారెడ్డితో కలిసి కడపలోని ఓ వివాహానికి వచ్చారు. రవీంద్రనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి పని నిమిత్తం స్కూటిపై భార్యాభర్తలు హౌసింగ్‌బోర్డు కాలనీకి బయలుదేరారు. నాగరాజుపేట వద్దకు రాగానే కడప-ప్రొద్దుటూరు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు తగలడంతో వెనుక టైరు కింద పడడంతో తల చిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రామలింగారెడ్డి మరో పక్కకు పడడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేసినట్లు తెలిపారు.