ఆర్డీవో రాకతో ఆక్రమణలకు అడ్డుకట్ట పడేనా..?

ABN , First Publish Date - 2022-02-20T04:48:48+05:30 IST

బద్వేలు, పోరుమామిళ్ల ,అట్లూరు మండలాలలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి.

ఆర్డీవో రాకతో ఆక్రమణలకు అడ్డుకట్ట పడేనా..?
బద్వేలులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన దృశ్యం

 బద్వేలు, పోరుమామిళ్లలో యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు  కోట్లాది రూపాయల ఆదాయానికి గండి

బద్వేలు, ఫిబ్రవరి19: బద్వేలు, పోరుమామిళ్ల ,అట్లూరు మండలాలలో  ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. ఇంత వరకు నియోజకవర్గ కేంద్రంగానే ఉన్న బద్వేలు పట్టణం రెవెన్యూ డివిజన్‌గా మారడంతోపాటు నూతనంగా ఆర్డీఓ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇంత వరకు అడ్డూ అదుపులేని భూఆక్రమణలకు నూతన ఆర్డీఓ రాకతోనైనా అడ్డుకట్ట పడుతుందని పట్టణవాసులతోపాటు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు  కబ్జాదారుల  కబంహస్తాలలో ఉండడం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడతున్నా పట్టించుకునేవారులేరు.   బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో గోపవరం మండలాలలో ప్రభుత్వ భూము ల ఆక్రమణలతోపాటు అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా  పుట్టగొడుగులా వెలుస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వినపడుతున్నాయి. మున్సిపాలిటీపరిధిలో ప్రభుత్వ జాగా ఖాళీ కనపడితే అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారు. అధికార  పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో  అధికారులు వాటిపై చర్యలు చేపట్టడంలో వెనకడుగు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బద్వేలు కబ్జాలకు అడ్డాగా మారిందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు.  ప్రభు త్వం పోరంబోకు స్థలాలు, కుంటలు, పంట కాలువలు సైతం కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. బద్వేలుకు స్థలాలు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాలవారు వస్తుండడంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. గుంతపల్లె  సర్వే నెంబరు 630,632,633లలో రిజిస్టరే కానీ (ఏడ బ్ల్యుఓ) స్థలాలను సైతం రిజిస్టర్‌చేసి వెంచర్‌ వేశారు. అలాగే  చెన్నంపల్లె సర్వే పొలంలోని 1794, 1795లలో దాదాపు 6ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ  దీని వెనుక ఖాళీగా ఉన్న స్థలాలను పూర్తిగా ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇంతజరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలుతీసుకున్న పాపాన పోలేదు. బద్వేలు రెవెన్యూ డివిజన్‌ అవడంతో పట్టణ విస్తీర్ణం విపరీతంగా పెరగడంతో ప్రభుత్వభూములు ఒక్కసారిగా అమాంతంగా పెరగడంతో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఖాళీ  కనపడితే కబ్జాదారులు గద్దల్లాగా వాలిపో యి ఆక్రమించుకుంటున్నారు. బద్వేలు పట్టణం లో  రిజిష్టర్‌ స్థలాలు 20 నుంచి 30 శాతం ఉంటే డీకేటి స్థలాలు 70 నుం చి 80 శాతం ఉండడంతో కబ్జాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఖాళీ స్థలాలతో పాటు గుట్టలు, చెరువులు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయి.  పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీలోని  సర్వేనెంబరు 1773లో  ఆక్రమణలు జోరుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి.

Updated Date - 2022-02-20T04:48:48+05:30 IST