సీపీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-10-04T05:19:11+05:30 IST

కేం ద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తున్న కార్మిక వ్యతిరేక విధా నాలపై విజయవాడలో నిర్వ హించనున్న సీపీఐ 24వ జాతీయ మహాసభలను జ యప్రదం చేయాలని ఏఐటీ యూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

సీపీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసులు

రాజంపేట, అక్టోబరు 3 : కేం ద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తున్న కార్మిక వ్యతిరేక విధా నాలపై  విజయవాడలో నిర్వ హించనున్న సీపీఐ 24వ జాతీయ మహాసభలను జ యప్రదం చేయాలని ఏఐటీ యూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. సోమవారం రాజంపేట ఏఐటీయూసీ కార్యా లయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 18 వరకు విజయవాడలో నిర్వహించనున్న ఏఐటీయూసీ మహాసభల్లో కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతతోపాటు, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే, విశాఖ ఉక్కు లాంటి పభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడం తదితర అంశాలపై ఈ సభల్లో చర్చిస్తారన్నారు. ఈ సభలకు అన్ని రంగాల కార్మికులు హాజరు కావాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఎస్‌.రాయుడు, పట్టణ కార్యదర్శి సికిందర్‌, రవి, వెంకన్న, నరసింహ, రమేష్‌, ఆంజనేయులు, లింగన్న నాయక్‌, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Read more