రైల్వేకోడూరులో భర్తపై భార్య దాడి...

ABN , First Publish Date - 2022-09-09T05:28:48+05:30 IST

రైల్వేకో డూరు పట్టణంలో భర్తను మంచానికి బంధించి చలాకుతో వాతలు పెట్టిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.

రైల్వేకోడూరులో భర్తపై భార్య దాడి...
తిరుపతిలో చికిత్స పోందుతున్న కరుణాకర్‌

భర్తను మంచానికి కట్టేసి చలాకుతో వాతలు


రైల్వేకోడూరు రూరల్‌, సెప్టెంబరు 8: రైల్వేకో డూరు పట్టణంలో భర్తను మంచానికి బంధించి చలాకుతో వాతలు పెట్టిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. రైల్వేకో డూరు ఎస్‌ఐ ఈవీవీ నరసింహం సమాచారం మేరకు.. పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో కిరాణా షాపు నిర్వహిస్తున్న ముర హరి కరుణాకర్‌కు భార్య కల్పన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కిరాణా షాపులో వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు, వడ్డీలకు సరిపోకపో వడంతో తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఈ విషయం కుటుంబం లోని పెద్దలకు తెలియడంతో వారు వచ్చి ఇద్ద రినీ మందలించి వెళ్లారు. కాగా అప్పుల బాధ, భర్త పెడుతున్న మానసికక్షోభ నుంచి బయటపడడానికి భార్య, పిల్లలు కరుణాకర్‌ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే నిర్బంధించి చలాకును స్టవ్‌ మీద కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టారు. కాలిన గాయాలతో ఇంటి నుంచి పారిపోయి తిరుపతి రుయా హస్పిటల్‌లో చేరి ప్రథమ చికిత్స పొందుతు న్నట్లు కరుణాకర్‌ తెలిపారు. ఈ మేరకు భార్య కల్పన, పిల్లలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Read more