విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2022-06-07T06:31:02+05:30 IST

వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా అదివారం రాత్రి జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు... మెరుపులు పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 36 మండలాకు గాను 25 మండలాల్లో భారీవర్షాలు పడ్డాయి. జిల్లా అంతా కలిపి ఏకంగా 1304 మి.మీ వర్షపాతం నమోదైంది. కడప మండలంలో అత్యధికంగా 104.6 మి.మీ వర్షపాతం నమోదుకాగా వేంపల్లె మండలంలో అత్యల్పంగా 2.8మి.మీ నమోదైంది.

విస్తారంగా వర్షాలు

జిల్లా అంతటా 1304 మి.మీ వర్షపాతం

కడప మండలంలో అత్యఽధికంగా 104.6 మి.మీ

వేంపల్లె మండలంలో అత్యల్పంగా 2.8 మి.మీ

182 మంది రైతులకు సంబంధించి 145 హెక్టార్లలో పంటనష్టం

కడప రూరల్‌, జూన్‌ 6: వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా అదివారం రాత్రి  జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు... మెరుపులు పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 36 మండలాకు గాను 25 మండలాల్లో భారీవర్షాలు పడ్డాయి. జిల్లా అంతా కలిపి ఏకంగా 1304 మి.మీ వర్షపాతం నమోదైంది. కడప మండలంలో అత్యధికంగా 104.6 మి.మీ వర్షపాతం నమోదుకాగా వేంపల్లె మండలంలో అత్యల్పంగా 2.8మి.మీ నమోదైంది. ఈ వర్షాల కారణంగా 182 మంది రైతులకు సంబందించి 145 హెక్టార్లలో అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో 142.80 హెక్టార్లలో అరటి పంట కాగా 3 హెక్టార్లలో మామిడి పంటలున్నాయి. పులివెందుల మండలంలో 161 మంది రైతులకు సంబంధించి 122 హెక్టార్లలో, వేముల మండలంలో 9 మంది రైతులకు సంబంధించి 8 హెక్టార్లలో, ఖాజీపేట మండలంలో ఒక్క రైతుకు సంబంధించి 80 సెంట్లు, కాశినాయన మండలంలో 8 మంది రైతులకు సంబంధించి 12 హెక్టార్లలో అరటి పంట దెబ్బతింది. అలాగే బి.మఠం మండలంలో ముగ్గురు రైతులకు చెందిన 3 హెక్టార్లలో మామిడి పంటకు నష్టం వాటిల్లింది.


మండలాల వారీగా వర్షపాతం మి.మీ.లలో

మండలం వర్షపాతం

కడప         104.6 

ఖాజీపేట 89.2

పెండ్లిమర్రి 83,6

చెన్నూరు 74,6

వల్లూరు 70.2

జమ్మలమడుగు 69.4

ఒంటిమిట్ట 66.8

కాశినాయన 60.4

పులివెందుల         52.4

సి.కె.దిన్నె 56.2

యర్రగుంట్ల         52.0

కలసపాడు 50.6 

తొండూరు 40.4

కమలాపురం         35.2

పెద్దముడియం         33.4

పోరుమామిళ్ల         30.2

మైలవరం 30.0

ముద్దనూరు         30.0

రాజుపాలెం 28.8

మైదుకూరు 26.4

అట్లూరు 25.8

సిద్దవటం 23.6

సింహాద్రిపురం         23.4

ప్రొద్దుటూరు         21.2

చాపాడు 20.4

దువ్వూరు 18.4

బి.మఠం 16.2

బి.కోడూరు 15.4

బద్వేలు 13,6

వి.ఎన్‌.పల్లె 10.0

కొండాపురం         7.8

లింగాల 6.2

గోపవరం 5.8  

చక్రాయపేట         5.0

వేముల 4.0

వేంపల్లి         2.8

Updated Date - 2022-06-07T06:31:02+05:30 IST