శ్మశానాలు ఏర్పాటు చేయలేని సమావేశాలెందుకు?

ABN , First Publish Date - 2022-10-13T04:15:23+05:30 IST

దళిత వాడల్లో శ్మశానాలకు స్థలాన్ని కేటాయించలేకపోతే మానటరింగ్‌ సమావేశాలు ఎందుకని మాల మహానాడు మండల అధ్యక్షుడు వీరణాల మాణిక్యం ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్మశానాలు ఏర్పాటు చేయలేని సమావేశాలెందుకు?
సమావేశంలో మాట్లాడుతున్న దళిత నాయకులు

మానిటరింగ్‌ సమావేశంలో దళితుల ఆగ్రహం

నిమ్మనపల్లె, అక్టోబరు 12: దళిత వాడల్లో శ్మశానాలకు స్థలాన్ని కేటాయించలేకపోతే మానటరింగ్‌ సమావేశాలు ఎందుకని మాల మహానాడు మండల అధ్యక్షుడు వీరణాల మాణిక్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మండల స్థాయి అధికా రులు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్‌ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్బంగా దళిత నాయకులు మాట్లాడుతూ మండలంలో దాదాపు 60కి పైగా దళితవాడలుండగా, దాదాపు ఐదేళ్లు ఒక్క కాలనీలో కూడా అభివృద్ధి పనులు జరగలేదన్నారు.  దళితవాడల్లో శ్మశానాలకు స్థలాలు కేటా యించాలని ఉన్నతాధికారులు చెపుతున్నా ఎలాంటి స్పందన లేదన్నారు.  దళిత వాడల్లో విద్యుత స్తంభాలు, మురుగు కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నా రు. కాగా, జగనన్న ఇళ్ల నిర్మాణానికి  రూ.5000లు చెల్లించి ఇసుక కొనుగో లు చేసుకొనే పరిస్థితి వచ్చిందని దళిత నేత మునిరత్నం ఆరోపించారు. మండలంలో ఇసుక రీచలు లేనప్పటికి వైసీపీ నాయకులకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు.  తహసీల్దార్‌ మంజుల మాట్లాడుతూ మండలంలో ఇసుక రీచలు లేకున్నా, ఉన్నతాధికారులు చెబితేనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.  తక్కువ ధరకే ఇసుకను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.  ఎంపీడీవో లీలామాధవి, ఎస్‌ఐ ఫాతిమా, ఏఈ వసంత రెడ్డి, ఏవో చంద్రశేఖర్‌, ఆర్‌ఐ ప్రసాద్‌, ఏపీవో రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-13T04:15:23+05:30 IST