యాప్‌ల నిర్వహణ మాటేమిటి ?

ABN , First Publish Date - 2022-11-30T23:23:31+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయు లు, ఉపాధ్యాయ సంఘం నేతలు హర్షం వ్య క్తం చేస్తున్నారు.

యాప్‌ల నిర్వహణ మాటేమిటి ?

ప్రభుత్వ నిర్ణయం ఉపాధ్యాయులంతా స్వాగతిస్తున్నారు

మరి నాడు - నేడు, మధ్యాహ్న భోజనం, యాప్‌ల నిర్వహణ ? : యూటీఎఫ్‌

కడప (ఎడ్యుకేషన్‌), నవంబరు 30: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయు లు, ఉపాధ్యాయ సంఘం నేతలు హర్షం వ్య క్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులను బోధనేత ర విధులకు దూరం చేస్తూ ప్రభుత్వం విడుద ల చేసిన గెజిట్‌, ఎయిడెడ్‌ సిబ్బంది ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు ఆనందదాయకమని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానిని స్వాగతిస్తున్నట్లు యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా తెలిపారు.

ప్రతి పదేళ్లకు ఒకసారి వచ్చే సెన్సస్‌, ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు ఆటంకమని చెబుతు న్న రాష్ట్ర ప్రభుత్వానికి తాము కోరింది ఒకటేనని చెప్పారు. ఎప్పుడో వేసవి సెలవుల్లో వచ్చే ఎన్నికల విధులు జనాభా లెక్కల నుంచి కా దు నిత్యం ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలిగిస్తున్న వాటి నుంచి విముక్తి కలిగించాల ని డిమాండ్‌ చేశారు. ప్రధానంగా నాడు, నే డు పర్యవేక్షణ, అనవసర యాప్‌ల నిర్వహణ, అమ్మఒడి, చేతులు కడిగించడం, నులిపురుగుల మాత్రలు మింగించడం, తల్లిదండ్రులతో బయోమెట్రిక్‌ వేయించడం, స్వచ్ఛభారత్‌, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం, ఫొటోలు తీయించడం, చైల్డ్‌ ఇన్‌ఫో, గోరుముద్దలు వండించడం వంటి వాటిని ఉపాధ్యాయులకు దూరం చేయాలని వారు కోరారు.

ఎస్టీయూ నేతలు...

ఉపాధ్యాయులను బోధనేతర విధులకు దూ రం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌పై ఎస్టీయూ జిల్లా మైనార్టీ కన్వీనర్‌ నజీబుల్లా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

ఉద్యోగ విరమణ పెంపు పట్ల హర్షం : ఎమ్మెల్సీ

కడప (ఎడ్యుకేషన్‌), నవంబరు 30: రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఉద్యోగ విరమ ణ వయస్సు 62 ఏళ్లకు పెంపు వర్తించేలా ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేయడం పట్ల ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ విద్యా చట్టం 1982లో 78ఎ నిబంధనను ఆంధ్రప్రదేశ్‌ విద్యా సవరణ చ ట్టం 2022 ద్వారా సవరించడం ద్వారా పొం దుపరిచారన్నారు. గెజిట్‌ ఉత్తర్వుల్లో ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో ఉద్యోగ విరమణ చేసిన బోధన, బోధనేతర సిబ్బంది అందరినీ పునర్‌ నియామకం చేసే విధంగా నిబంధన పొం దుపరచబడినందున వీరందరికీ 1.1.2022 నుంచి వేతనంతో కూడిన సర్వీసు మంజూర య్యేలా ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఐదు రకాల గురుకులాలు, గ్రంథాలయాలు కూడా ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటైనందున వాటి లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఉద్యోగ విరమణ వయస్సు పెంపును వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు.

మరో ప్రకటనలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయవేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ఎయిడెడ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కనపర్తి త్రివిక్రమ్‌రెడ్డి హర్షం ప్రకటించారు.

Updated Date - 2022-11-30T23:23:33+05:30 IST